దేశంలో మార్పు మొదలైంది
‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎక్స్ వేదికగా శనివారం ఆయన పెట్టిన ఆసక్తికర పోస్ట్ రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
దేశ భవిష్యత్తును నిర్దేశించేది యువశక్తేనని, వారు అనుకొన్నది సాధించి తీరుతారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పోరాడిన యువతకు, ఇతర వర్గాలకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. హరీశ్‌రావు పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది. యువత, ఆయన మద్దతుదారులు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ తమ మద్దతు ప్రకటించారు. సమాజంలో సరికొత్త ఆలోచనలు, యువశక్తికి ప్రాధాన్యం పెరగడానికి ఈ రకమైన సానుకూల ధోరణి ఎంతగానో తోడ్పడుతుందని నెటిజన్లు తమ కామెంట్లతో అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

