హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివేదికను సిద్ధం చేశారు. ఏడు పేజీలున్న ఈ నివేదికను త్వరలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు సమర్పించరున్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాకే నివేదికను సిద్ధం చేసినట్టు జగ్గారెడ్డి చెప్పారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి రాజకీయాలు నాకు కొత్తకాదు. ఎవరి సామర్థ్యం ఏందో నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.