తిరువనంతపురం: కేరళలోని కన్నూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రోడ్డుపై పార్కు చేసిఉన్న కారును తాకాడని ఓ మైనర్ బాలుడిని విచక్షణా రహితంగా తన్నాడో వ్యక్తి. గురువారం సాయంత్రం కన్నూరు జిల్లాలోని తలస్సేరి పట్టణంలో మొహమ్మద్ షిహషాద్ అనే వ్యక్తి తన కారును రోడ్డుకు పక్కగా ఆపాడు. అదేసమయంలో అక్కడ ఉన్న ఆరేండ్ల బాలుడు దానికి ఆనుకొని నిలబడ్డాడు.
గమనించిన మొహమ్మద్.. కారును తాకుతావా అంటూ ఆవేశంతో బాలుడి నడుముపై తన్నాడు. దీనిని చూసిన స్థానికులు కారు యజమానిని నిలదీశారు. అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ పిల్లవాడు తన కారు డోరు తీయడానికి ప్రయత్నించాడని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చూశాడు. బాధితుడిని దవాఖానకు తీసుకెళ్లారు. ఇదంతా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
Police refused to register FIR and tried to protect the perpetrator. It was the natives who took the child to the hospital. This incident shook the conscience of the Keralites. Stringent action should be taken against the police officers who tried to downplay the issue. pic.twitter.com/xJwFJAQmZh
— K Surendran (@surendranbjp) November 4, 2022
కాగా, నిందితుడిని రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అతడికి శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.