Road Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. భావ్‌నగర్ (Bhavnagar) జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్ ట్రక్కును ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీ కొట్టింది (bus rams into dumper truck). ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షద్ పటేల్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Harish Rao | ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు
Donald Trump | హష్ మనీ కేసు.. ట్రంప్‌కు భారీ షాక్
Air Pollution | ఢిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 400 మార్క్‌ను దాటిన ఏక్యూఐ