Donald Trump | అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. హష్ మనీ చెల్లింపుల (Hush money) కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో తనకు ఉపశమనం కల్పించాలంటూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మన్‌హట్టన్ న్యాయమూర్తి సోమవారం విచారణ చేపట్టారు. అధ్యక్షులకు విస్తృతమైన రక్షణ కల్పించే సుప్రీంకోర్టు నిర్ణయం.. ఈ కేసుకు వర్తించదని పేర్కొన్నారు. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు.
ఇదీ కేసు..
డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) ఆరోపించారు. ‘ఆ విషయాన్ని’ బయటపెట్టకూడదంటూ తనను బెదిరించిట్లు వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్ చెప్పారు. ఆ తరువాత, ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనంటూ ప్రకటించారు. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డుల్లో ఈ మొత్తాన్ని ‘లీగల్ ఫీజు’ కింద చెల్లించినట్టు ఉందన్నారు. ఈ కేసులో ఐదేండ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతున్నది.
Also Read..
School Shooting | స్కూల్లో కాల్పుల మోత.. టీచర్ సహా ఐదుగురు మృతి
Russia Visa | భారతీయులకు రష్యా వీసా ఫ్రీ ఎంట్రీ