School Shooting | స్కూల్లో కాల్పుల మోత.. టీచర్ సహా ఐదుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో (School Shooting) విరుచుకుపడ్డాడు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో (School Shooting) విరుచుకుపడ్డాడు. దీంతో టీచర్ సహా ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. భారీగా పోలీసు వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజన్లు స్కూల్ వద్ద మోహరించాయి.
గాయపడినవారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని మాడిసన్ పోలీస్ చీప్ షాన్ బార్న్స్ తెలిపారు. మరో ఇద్దరు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. మృతుల్లో టీచర్‌తోపాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారన్నారు. నిందితుడు హాండ్‌గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడని, అతడు కూడా చనిపోయాడని వెల్లడించారు. కాగా, కాల్పుల ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు.
అగ్రరాజ్యంలోని పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు స్కూళ్లలో 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 1966 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. ఆ ఏడాది వివిధ స్కూళ్లలో 349 కాల్పుల ఘటనలు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

