Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400 మార్క్‌ను దాటింది. గాలి కాలుష్యానికి తోడు చలి తీవ్రతకూడా పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 5 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ డేటా ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 421గా నమోదయ్యాయి. నగరంలోని 37 మానిటరింగ్ స్టేషన్లలోని 26 స్టేషన్లు 400 మార్క్‌ను దాటాయి. జహంగీర్‌పురిలో ఏక్యూఐ లెవల్స్ 466గా నమోదయ్యాయి. ఆనంద్ విహార్‌లో 465, బవానా ప్రాంతంలో 465, రోహిణి ప్రాంతంలో 462, లజ్‌పత్ నగర్లో 461, అశోక్ విహార్‌లో 456, పంజాబి భాగ్‌లో 452గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
రాజధానిలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 (Graph 4) ఆంక్షలను విధించినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్మెంట్ (Air Quality Index Management) వెల్లడించింది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించారు.
Also Read..
TTD | రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Anand Yadav | మంత్రగాడి మాట విని.. సంతానం కోసం కోడిపిల్లను మింగాడు.. ప్రాణాలు కోల్పోయాడు