అమరావతి: బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలోని మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలోని అమరావతి డివిజన్ ఐదు జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 557 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు అధికారిక నివేదిక వెల్లడించింది.
అమరావతి జిల్లాలో అత్యధికంగా 170 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోగా.. యావత్మల్లో 150, బుల్దానాలో 111, అకోలాలో 92, వాశిమ్లో 34 మంది ఉసురు తీసుకొన్నారని అమరావతి డివిజనల్ కమిషనరేట్ రూపొందించిన నివేదిక పేర్కొన్నది. వీరిలో కేవలం 53 మంది రైతు కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారం అందగా.. ఇంకా 284 మంది రైతుల ఆత్మహత్యలపై విచారణ పెండింగ్లో ఉన్నదని తెలిపింది.