JN.1 | డేంజర్ బెల్స్.. 511కి పెరిగిన కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు..!
JN.1 | భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 500 దాటాయి. జనవరి 2వ తేదీ వరకూ కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు దేశవ్యాప్తంగా 511కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
JN.1 | భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 500 దాటాయి. జనవరి 2వ తేదీ వరకూ కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు దేశవ్యాప్తంగా 511కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడినట్లు తెలిపాయి.
ఈ తరహా కేసులు కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలో 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి.
Also Read..
Chaddannam | అమెరికాలో చద్దన్నానికి యమా క్రేజ్.. ధర తెలిస్తే షాకే..!
Leopard | అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన చిరుత.. వీడియో
Coronavirus | 24 గంటల్లో 602 కొత్త కేసులు.. ఐదు మరణాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

