కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 29 : మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న 9 మంది మహిళలు సహా మొత్తం 51 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారని ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు. వీరిపై రూ.66 లక్షల రివార్డులు ఉన్నట్లు ప్రకటించారు.