మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.