భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ నెల 4న ఓ చెరువులో వందలాది ఓటర్ కార్డులు లభించడం కలకలం రేపింది. బిజావర్ పట్టణంలోని రాజా చెరువులో ఈ కార్డులు దొరికాయి. పారిశుధ్య కార్మికులు చెరువును శుభ్రం చేస్తుండగా వార్డ్ నెం.15కు సంబంధించిన ఈ కార్డులు దొరికాయని అధికారులు తెలిపారు. ఇవి ఓటర్లకు పంపిణీ చేయని ఓటర్ కార్డులని స్థానికులు తెలిపారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈసీ దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత గగన్ యాదవ్ డిమాండ్ చేశారు.