గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో 17 ఏళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఐదేండ్ల బాలికపై అఘాయిత్యం చేసి, ఆమె తలను అనేకసార్లు గోడకు మోదాడు. అతనిని అరెస్ట్ చేసి, మైనర్‌గా పరిగణించి, విచారిస్తున్నారు. కమల రాజా దవాఖాన వైద్యులు మాట్లాడుతూ, బాధితురాలి మర్మాంగాలకు 28 కుట్లు వేసినట్లు, కోలొస్టోమీ ఆపరేషన్ చేశామని, ఆమె మాట్లాడలేకపోతున్నదని చెప్పారు.
బాధితురాలు ఈ నెల 23న కనిపించకుండాపోయింది. 2 గంటల తర్వాత తన ఇంటికి సమీపంలో అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో కనిపించిం ది. ఇంత దారుణానికి పాల్పడిన బాలుడికి మరణశిక్ష విధించాలని స్థానికులు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.