Lok Sabha | లోక్సభ (Lok Sabha)లో భద్రతా ఉల్లంఘన ఘటన (Parliament Security Breach)పై విపక్షాల ఆందోళనతో నేడు పార్లమెంట్ ఉభయసభలు (Parliament Houses) దద్దరిల్లాయి. ఉదయం ఉభయ సభలు ప్రారంభంకాగానే విపక్ష ఎంపీలు బుధవారం లోక్సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై నిరసనకు దిగారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడ్డారు. విపక్ష ఎంపీల ఆందోళనలతో ఎగువ, దిగువ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 14 మంది విపక్ష ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్సెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, డీఎంకే ఎంపీ కనిమొళి ఉన్నారు. వారితోపాటు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ కుర్యాకుల, బెన్సీ బెహనన్, వీకే శ్రీకందన్, మహ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కె సుబ్రహ్మణ్యం, ఎస్ఆర్ పార్థిబన్, ఎన్ వెంకటేశన్ తదితరులను మిగిలిన సెషన్స్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ సభలో తీర్మానించారు.
రాజ్యసభ నుంచి తృణమూల్ ఎంపీ సస్పెండ్..
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (Trinamool MP) డెరిక్ ఒబ్రెయిన్ (Derek OBrien) రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ (suspended) అయ్యారు. బుధవారం లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై నేడు రాజ్యసభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ (Rajya Sabha Chairman) జగదీప్ (Jagdeep Dhankhar)తో ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపారు. దీంతో చైర్మన్ ఒబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రెయిన్ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read..
Derek OBrien | రాజ్యసభ నుంచి తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సస్పెన్షన్
Parliament Breach | సభలో భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ ఇవ్వాలి : విపక్షాల డిమాండ్