న్యూఢిల్లీ: రష్యా సైనిక దళంలో పనిచేస్తున్న 49 మంది భారతీయలు.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో మృతిచెందినట్లు సుప్రీంకోర్టు(Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రష్యా దళంలో మొత్తం 217 మంది భారతీయులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఓ నివేదికను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అందజేసింది. ఆ నివేదిక ప్రకారం.. రష్యన్ ఆర్మీలో చేస్తున్న సుమారు 139 మంది భారతీయులను కాంట్రాక్టు నుంచి తప్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ వార్‌లో 49 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
రష్యా వైపు ఆరుగురు భారతీయ సైనికులు మిస్సింగ్‌లో ఉన్నారు. మరో 23 మంది ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియదు. మాస్కోలో ఉన్న భారతీయ ఎంబసీ వారి కోసం అన్వేషణ కొనసాగిస్తుందని ఆ రిపోర్టులో చెప్పారు. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. 217 మంది భారతీయులు.. రష్యా సైనిక దళంలో చేరినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఓ పిటీషనర్ కోర్టులో కోరారు. రష్యా 26 మంది భారతీయుల్ని తమ ఆధీనంలో ఉంచుకుందని, వారిని ఉక్రెయిన్‌తో వార్‌లో పోరాడేలా వత్తిడి చేస్తోందని, వారిని ఎలాగైన భారత్‌కు తీసుకురావాలన్న డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటీషన్‌పై ప్రభుత్వం స్పందించింది.
సుమారు 21 మంది బాధిత కుటుంబీకుల డీఎన్ఏ శ్యాంపిళ్లను రష్యా అధికారులకు పంపినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. సీజే సూర్యకాంత్‌కు తెలిపారు.