ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 09:54:29

దేశంలో 13 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్‌లు

దేశంలో 13 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్‌లు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ప్ర‌తిరోజు 40 వేల‌పైచిలుకు కేసులు న‌మోద‌వుతుండ‌టంతో కేవలం మూడు రోజుల్లోనే ల‌క్ష‌కుపైగా కేసులు పెరిగాయి. నిన్న సుమారు 50 వేల మంది క‌రోనాబారిన ప‌డ‌గా, తాజాగా కేసుల తీవ్ర‌త కాస్త త‌గ్గి 48 వేల కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 13 లక్ష‌లు దాటాయి. 

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు న‌మోవ‌ద‌గా, 757 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,36,861కు చేర‌గా, మృతుల సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,56,071 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 8,49,431 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. 

జూలై 24 వ‌ర‌కు దేశంలో 1,58,49,068 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, నిన్న ఒక్క‌రోజే 4,20,898 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భారతీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఒకేరోజు ఇంతపెద్ద మొత్తంలో ప‌రీక్ష‌లు 


logo