ఏదైనా కొత్త స్కూళ్లో పిల్లలు చేరితే వారికి పరీక్షలు నిర్వహించడం విన్నాం. లేదు… కొత్త ఉద్యోగంలో చేరితే అక్కడి యాజమాన్యం ఇంటర్వ్యూ చేయడం విన్నాం. కానీ… యూపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పద్ధతికి తెర లేపింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవికి ఎంపిక కావాలంటే పార్టీ అధిష్ఠానం నిర్వహించే పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షను పూర్తిగా పక్కా ప్రొఫెషనల్ పద్ధతిలోనే పార్టీ నిర్వహిస్తోంది. ఈ రాత పరీక్ష జరిగే సమయంలో ఇన్విజ్లేటర్లు కూడా ఉంటారు. దీంతో కాంగ్రెస్ లో అధికార ప్రతినిధి పదవి చేపట్టడం అంత సులువైన పని కాదని స్థానిక నేతలు అంటున్నారు.
అంతేకాకుండా సదురు నేతకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది… యూట్యూబ్ ఛానల్ ఉందా? ఫేస్బుక్ పేజీ ఉందా? ఉంటే దాని పేరు.. ఇలా ప్రతి చిన్న విషయంపై కూడా పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికి 75 జిల్లాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 2850 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నిడివి 45 నిమిషాలు. 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కాగా… 2 ప్రశ్నలు విశ్లేషణతో కూడినవి. ఆ పరీక్ష పేపర్లోని కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.