శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 14:33:53

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల హతం

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల హతం

కంధమాల్‌: ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీసులు భారీ ఝలక్‌ ఇచ్చారు. కంధమాల్‌ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం మెరుపు దాడులు చేయగా, వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్‌ జిల్లా సిర్లా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరికొందరు మావోయిస్టులు పరారైనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన నలుగురిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరిపై గతంలో రివార్డులు ప్రకటించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు బీజీఎన్‌ డివిజన్‌కు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. కాగా, పలువురు అగ్రనేతలు తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతున్నది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo