న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కరువు భత్యం, యాసంగి పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం 7వ వేతన కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపింది. 42 శాతంగా ఉన్న ప్రస్తుత డీఏ 46 శాతానికి పెరుగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. పెరిగిన డీఏ ఈ ఏడాది జూలై 1 నుంచే వర్తిస్తుందని, తద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. 2024-25 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి యాసంగిలో 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
16