Road Accident | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాన్పూర్ దెహత్ (Kanpur Dehat) జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో (speeding car crashes into tree) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్, నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Minister KTR | కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ : మంత్రి కేటీఆర్
Minister Ktr | కాంగ్రెస్కు ఇక్కడ బేస్ లేదు.. రెండో స్థానం కోసమే పాకులాట : మంత్రి కేటీఆర్