Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎన్నికల వేళ బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, టీవీ ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ9 నిర్వహించిన మెగా కాన్ క్లేవ్ (Tv9 Mega Political Conclave 2023)లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు.
* సంక్షేమాన్ని కడుపునిండా చేస్తూ పేదల్ని, పెద్దల్ని అందరినీ ఏకకాలంలో సంతృప్తి పరుస్తున్న ప్రభుత్వం, పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అనేది చాలా ముఖ్యం. మంచిగా పనిచేసే వాళ్లని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. కేసీఆర్ మీ జేబులో ఉన్న వంద రూపాయి నోటు లాంటోడు. కింద రోడ్డుమీద ఏదో చిల్లర కనిపిస్తే దాని కోసం ఆశపడితే జేబులో ఉన్నది పోతుంది. కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఇవాళ మొత్తం భారతదేశం పరిస్థితి చూసుకుంటే ఇంత వేగంగా మౌలిక వసతుల కల్పన చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. తాగునీరు, కరెంట్, సాగునీరు ఇలా అన్నింటినీ ఎంతో వేగంగా ప్రజలకు అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
* ఏ రాష్ట్రమైనా ముందుకు పోవాలి.. అందులోనూ ఓ కొత్త రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. అది ఏ కాంగ్రెస్ వల్లో, బీజేపీ వల్లో అయ్యే పని కాదు. కేవలం బీఆర్ఎస్ వల్ల మాత్రమే అది సాధ్యం. ఒక విజన్ ఉన్న నాయకత్వం కేవలం బీఆర్ఎస్ మాత్రమే.
* అన్నింటికీ మించి కాంగ్రెస్ అనేది గతం.. బీఆర్ఎస్ భవిష్యత్తు. వర్తమానమూ భవిష్యత్తూ రెండూ అల్టిమేట్‌గా అవగాహన ఉన్న పార్టీ బీఆర్ఎస్. భవిష్యత్తును ఆశించేవారు, భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని కోరుకునే వారు బీఆర్ఎస్కు ఓటు వేయాలి.
Also Read..
Minister Ktr | కాంగ్రెస్‌కు ఇక్కడ బేస్ లేదు.. రెండో స్థానం కోసమే పాకులాట : మంత్రి కేటీఆర్
KTR | పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్
KTR | ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ చిరునామా : మంత్రి కేటీఆర్