న్యూఢిల్లీ: ఢిల్లీ, దేశ రాజధాని నగర ప్రాంతం గురువారం భూకంపంతో వణికింది. హర్యానాలోని ఝజ్జర్‌లో దీని కేంద్రం ఉంది. ఈ భూకంపం గురువారం ఉదయం 9.04 గంటలకు 10 కి.మీ. లోతులో సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.4గా నమోదైనట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ తెలిపింది.
భూకంపం రావడంతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో ఇండ్లు, కార్యాలయాల్లోని ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఇతర వస్తువులు అకస్మాత్తుగా కదలడంతో జనం బయటకు పరుగులు తీశారు. ఝజ్జర్ నుంచి 200 కి.మీ. పరిధిలోని గురుగ్రామ్, రోహ్తక్, దాద్రి, మీరట్, బహదూర్గఢ్లలో కూడా ప్రకంపనలు కనిపించాయి.