పోర్ట్‌బ్లేయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్‌లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది. డిగ్లిపూర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నదని తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. కాగా, రాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో గత నెల 10న కూడా భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యాన 70 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని NCS తెలిపింది.