Students | న్యూఢిల్లీ: దేశంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యపై నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ వివరాల ప్రకారం 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువే విద్యార్థులు ఉన్నారు. వీరిలో 10 శాతం విద్యాసంస్థల్లో 20 మంది కన్నా తక్కువే ఉన్నారు. చాలా చోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే ఈ పాఠశాలలను నెట్టుకొస్తున్నారు.
దీంతో టీచర్లు తమకు సంబంధం లేని సబ్జెక్టులు కూడా బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. పలువురు ఉపాధ్యాయులకు బోధనేతర కార్యకలాపాలు అప్పగిస్తుండటంతో వారు తమ వృత్తికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. 2023-24 నాటికి ప్రాథమిక నుంచి హైస్కూల్ స్థాయి వరకు చెప్పే టీచర్లలో 12 శాతం మందికి వృత్తిపరమైన అర్హతలు లేవు. కేంద్ర విద్యా శాఖ వివరాల ప్రకారం 2023-24 నాటికి 48 శాతం టీచర్లు విద్యార్హతలు లేనివారు.