Suvendu Adhikari : గత నెలలో పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టిన సువేందు అధికారి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి.. మంత్రులతో ప్రమాణం చేయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఏ) ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో 44 మంది మంత్రులకు అవకాశం ఉంది. తాజాగా 35 మందికి చోటు దక్కడంతో, సీఎంతో కలిసి మొత్తం 41 మంది మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఇంకో ముగ్గురికి చోటుంది. గత నెల 9న సువేందు అధికారి సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతోపాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిశిత్ ప్రణామిక్, అశోక్ కీర్తనియా, క్షుదిరామ్ టూడు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీళ్లే.
దీపక్ బర్మాన్, తపాస్ రాయ్, శంకర్ ఘోష్, మనోజ్ కుమార్ ఒరావోన్, గౌరీ శంకర్ ఘోష్, స్వపన్ దాస్ గుప్తా, కల్యాణ్ చక్రవర్తి, అరుప్ కుమార్ దాస్, దూద్ కుమార్ మోండల్, శరద్వాత్ ముఖర్జీ, జగన్నాథ్ చట్టోపాధ్యాయ్, అర్జున్ సింగ్, మాలతీ రావా రాయ్, రాజేష్ మహతా, ఇంద్రాని ఖాన్, కౌషిక్ చౌదరి, గార్గి దాస్ ఘోష్, భాస్కర్ భట్టాచార్య, దిబాకర్ ఘరామి, సుమన సర్కార్, జోయెల్ ముర్ము, అశోక్ దిండా, ఆనందమయ్ బర్మన్, హరేకృష్ణ బేరా, శంతను ప్రమాణిక్, ఉమేష్ రాయ్, పూర్ణిమా చక్రవర్తి, మౌమితా బిశ్వాస్ మిశ్రా, కలితా మాజి, బిషాల్ లామా, అజయ్ కుమార్ పొద్దార్, బిరాజ్ బిశ్వాస్, దీపాంకర్ జానా, అమైరా కిస్కు, నదియార్ చాంద్ బౌరి.