Air Pollution | న్యూఢిల్లీ, జూలై 4: వాయు కాలుష్యం కారణంగా భారత్లో 2008-2019 మధ్య కాలంలో ఏటా 33 వేల మరణాలు సంభవించాయని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉండటంతో పది నగరాల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసి నగరాల్లో గాలిలో 2.5 పీఎం ధూళి కణాల పెరుగుదలే మరణాలకు కారణమని అధ్యయనం తెలిపింది.
గురువారం ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భారత్లోని వివిధ రాష్ర్టాల అసమర్థతను తాజా నివేదిక తెలియజేస్తున్నదని అధ్యయనానికి నేతృత్వం వహించిన భార్గవ్ కృష్ణ తెలిపారు. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2023 ప్రకారం ప్రపంచంలో మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ నిలిచింది.