డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
నిరుడు ఈ యాత్ర ప్రారంభమైన మే 10 నుంచి మే 23 వరకు 9,61,302 మంది సందర్శించారు. ఎస్డీసీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ చీఫ్ అనూప్ నౌటియాల్ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్ర దాడి, భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల ప్రభావం భక్తులపై పడిందన్నారు.