Bihar | పాట్నా : ఓ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని పబ్ జీ ఆడుతుండగా.. వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ముగ్గురు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. పబ్ జీ గేమ్‌లో నిమగ్నం కావడంతో.. రైలును గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. దీంతో రైలు వారిని ఢీకొట్టిందన్నారు. మృతులను ఫర్ఖాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా పోలీసులు గుర్తించారు. మృతుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Flights Delayed: ఢిల్లీలో మంచుదుప్పటి.. వందకుపైగా విమానాలు ఆలస్యం
Pregnant woman dies | ప్రసవ సమయంలో గుండెపోటు.. గర్భిణి మృతి
Vande Bharat Sleeper | గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న వందే భారత్ స్లీపర్ రైలు.. వీడియో