న్యూఢిల్లీ : ఢిల్లీ – హర్యానా సరిహద్దులో గురువారం ఉదయం ఘోరం జరిగింది. ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళలపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన మహిళలను పంజాబ్లోని మాన్సా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న టిక్రీ సరిహద్దు వద్ద చోటు చేసుకుంది. గత 11 నెలల నుంచి రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.