దుర్గా పూజలో అపశ్రుతి.. మండపంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు. భదోహిలోని దుర్గామాత మండపంలో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హారతి ఇస్తుండగా ప్రమాద వశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక యంత్రం సహాయంతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

