ముంబై, ఫిబ్రవరి 5: ముంబైలో 3 శాతం విడాకులకు ట్రాఫిక్ కష్టాలే కారణమని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఆరోపించారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారని, కుటుంబాలతో గడపలేకపోతున్నారని, ఫలితంగా విడాకులు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లపై గుంతలను ఎప్పుడు పూడుస్తారో చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.