న్యూఢిల్లీ, ఆగస్టు4: దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం సహ్రాన్పూర్ స్టేషన్ వద్ద ఢిల్లీ-సహ్రాన్పూర్ మెము ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంది. రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. గత 18 రోజుల్లో ఇది 10వ ఘటన. ప్రమాద సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవటంతో, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. సహ్రాన్పూర్ రైల్వే స్టేషన్ యార్డ్ పరిధిలో రైలును నావిగేటింగ్ పాయింట్ వద్దకు తీసుకెళ్తుండగా రెండు కోచ్లు పట్టాలు తప్పాయి.