Karnataka | కర్ణాటక (Karnataka)-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మరణించాయి. మలై మహదేశ్వర వైల్డ్ లైఫ్ డివిజన్ (Malai Mahadeshwara Wildlife Division)లో తల్లి పులి, నాలుగు కూనలు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయం వెల్లడైంది. ఆవును పులి చంపిందన్న కోపంతో ఓ వ్యక్తి పులికి విషం పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కర్ణాటకకు చెందిన ముదురాజు అనే వ్యక్తికి చెందిన ఆవును ఇటీవలే పులి వేటాడి చంపింది. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న ఆవును పులి చంపడంతో ముదురాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా పులి పని పట్టాలని పథకం వేశాడు. మరో ఇద్దరితో కలిసి చనిపోయిన తన ఆవు కళేబరంలో విషం చల్లి.. పులికి ఎర వేశాడు. విషం పెట్టిన ఆవు కళేబరాన్ని తిని పులి, దాని నాలుగు కూనలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముదురాజుతోపాటు ఆయనకు సహరించిన నాగరాజు, కోనప్పని పోలీసులు అరెస్ట్ చేశారు.
ಚಾಮರಾಜನಗರ: ತಾಯಿ ಹುಲಿ ಹಾಗು ಮೂರು ಮರಿ ಹುಲಿಗಳ ಅಸಹಜ ಸಾವು. ಎಂ.ಎಂ.ಹಿಲ್ಸ್ ವನ್ಯಧಾಮದ ಮೀಣ್ಯಂ ವಲಯದಲ್ಲಿ ಘಟನೆ.
ವಿಷ ಪ್ರಶಾನ ಶಂಕೆ. ಸ್ಥಳಕ್ಕೆ ಅರಣ್ಯಾಧಿಕಾರಿಗಳ ದೌಡು. ಪಿಸಿಸಿಎಫ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತನಿಖೆ ನಡೆಸಿ ವರದಿ ನೀಡಲು ಅರಣ್ಯ ಸಚಿವ ಈಶ್ವರ ಖಂಡ್ರೆ ಆದೇಶ. ಸಿಬ್ಬಂದಿ ನಿರ್ಲಕ್ಷ್ಯವಿದ್ದರೆ ಶಿಸ್ತು ಕ್ರಮ.
ವಿಷ ಪ್ರಾಶಾನವಾಗಿದ್ದರೆ… pic.twitter.com/huWTQrqZuF— JustKannada (@JustKannada) June 26, 2025
Also Read..
Helmet | టూవీలర్ కొన్నపుడే రెండు హెల్మెట్లు తప్పనిసరి.. కేంద్రం కీలక ఆదేశాలు జారీ..!
Kolkata law college | లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్.. కాలేజీ సెక్యూరిటీ గార్డు అరెస్ట్