Kolkata | ఆర్జీకర్ హత్యాచార ఘటనను మరవక ముందే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కోల్‌కతా న్యాయ కళాశాలకు (Kolkata law college) చెందిన 24 ఏండ్ల విద్యార్థిని (law Student)పై అదే కళాశాల పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగం నాయకుడు మరో ఇద్దరు విద్యార్థులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
మరోవైపు అత్యాచారం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ దారుణాన్ని ఆర్జీకార్ హత్యాచార బాధితురాలి తండ్రి (RG Kar Victims Father) తీవ్రంగా ఖండించారు. ‘పశ్చిమ బెంగాల్లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నా కుమార్తెలా ఇంకెంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలికావాలి..?’ అంటూ ప్రశ్నించారు. తన కుమార్తె విషయంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి పోరాడినా, పరిస్థితుల్లో మార్పు రాకపోవడంపై ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఉదాసీనత వల్లే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
Kolkata law college | లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్.. కాలేజీ సెక్యూరిటీ గార్డు అరెస్ట్
Helmet | ద్విచక్ర వాహనంతోపాటు రెండు హెల్మెట్లు తప్పనిసరి