ముంబై: ఆ గ్రామంలో మొత్తం జనాబా 1500. విచిత్రంగా ఆ ఊరిలో కేవలం మూడు నెలల వ్యవధిలో నమోదైన జననాలు 27,397. రాష్ట్రంలోనే అతిపెద్ద జనన ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో ఒకటిగా దీనిని పేర్కొంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 25 వరకు నమోదైన జనన, మరణ నమోదుల తనిఖీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుండగా, యావత్మాల్ జిల్లాలోని లర్ని తహశీల్లోని షెందూర్సాని గ్రామంలో ఈ అక్రమాలు బయటపడ్డాయి.
గ్రామ పంచాయతీ పౌర నమోదు వ్యవస్థ లాగిన్ ఐడీ ముంబైకు మ్యాప్ చేసినట్టు నిర్ధారించారు. ఒక అధునాతన సైబర్ క్రైమ్ ముఠా ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నది.