న్యూఢిల్లీ, మే 8 : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 27 ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసుల్ని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో గురువారం ఒక్క రోజే 430కిపైగా ఫ్లైట్స్ రద్దు అయినట్టు, ఇందులో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే 90 ఫ్లైట్స్ ఉన్నాయని సమాచారం. ఇందులో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయని, వివిధ విమానయాన సంస్థల తమ విమానాలను రద్దు చేశాయని తెలిసింది.
దేశ ఉత్తర, వాయువ్య, నైరుతి ప్రాంతాలు, మధ్య భారత్‌లోని పలు విమానాశ్రయాల్ని మే 10 వరకు తాత్కాలికంగా మూసివేసినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో సహ వివిధ విమాయాన సంస్థలకు సంబంధించి వందలాది ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయినట్టు తెలిసింది. ‘ఫ్లైట్ స్టేటస్’ తెలుసుకొవాలంటూ విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థలు సూచించాయి.