ఇండోర్: ట్రాన్స్జెండర్ల(Transgenders) వర్గానికి చెందిన 25 మంది ఫినాయిల్ తాగారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. బాటిళ్లు పట్టుకుని ట్రాన్స్జెండర్లు ఓ గుంపుగా కలిసి తాగుతున్న వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఏ ఒక్క పేషెంట్ కూడా క్రిటికల్‌గా లేరని మహారాజా యశ్వంతరో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ తెలిపారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన 25 మంది ఆస్పత్రిలో చేరారని, ఫినాయిల్ తాగినట్లు వాళ్లు చెబుతున్నారని, బుధవారం రాత్రి ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి వచ్చారని, అయితే ఇప్పుడే ఈ అంశాన్ని కన్ఫర్మ్ చేయలేమని ఓ అధికారి తెలిపారు. దేనికోసం ట్రాన్స్జెండర్లు ఫినాయిల్ తాగారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Over 20 members of the LGBTQ+ community were hospitalized in Indore, Madhya Pradesh, after reportedly consuming phenyl to protest alleged incidents of rape and abuse.#Indore #TransgenderHospitalized pic.twitter.com/r5uzXArcd6
— Sumit Kumar📸 (@Photo_Sumit_) October 16, 2025
అదనపు డిప్యూటీ కమీషనర్ రాజేశ్ దందోతియా మాట్లాడుతూ.. దర్యాప్తు జరిగిన తర్వాతనే ట్రాన్స్జెండర్లు ఏం పదార్థం తీసుకున్నారో తెలుస్తుందని తెలిపారు. అయితే స్థానిక ట్రాన్స్‌జెండర్ గ్రూపుల మధ్య జరిగిన వివాదం వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. అత్యాచారాలు, వేధింపు ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో.. నిరసనగా ట్రాన్స్జెండర్లు ఫినాయిల్ తాగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.