గువాహటి: అసోంలోని కరీంగంజ్ (karimganj) జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. త్రిపుర సరిహద్దులకు సమీపంలో ట్రక్కులో తరలిస్తున్న 2360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అసోం- త్రిపుర సరిహద్దుల్లోని చురైబారీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న ట్రక్కును పోలీసులు పట్టుకున్నారు. దీనితో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని త్రిపుర నుంచి తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయినిఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.
కగా,ఆ శనివారం రాత్రి కూడా అదే ప్రాంతంలో 256 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడటం గమనార్హం. గంజాయిని తరలిస్తున్న ట్రక్కును సీజ్ చేశారు.