ముంబై: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్‌లో గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆ సమస్యను ఎందుకు లేవనెత్తడం లేదన్నారు. ఢిల్లీలో కేదార్నాథ్(Kedarnath) లాంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో స్కామ్ చేశారని, ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ఆలయాన్ని నిర్మిస్తారా అని అవిముక్తేశ్వరానంద ఆరోపించారు. ఇక్కడ కాకుంటే మరో చోట స్కామ్ జరుగుతుందని, కేదార్నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం అదృశ్యమైనట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
#WATCH | Mumbai: On Kedarnath Temple to be built in Delhi, Shankaracharya of Jyotirmath, Swami Avimukteshwaranand alleges, “There is a gold scam in Kedarnath, why is that issue not raised? After doing a scam there, now Kedarnath will be built in Delhi? And then there will be… pic.twitter.com/x69du8QJN2
— ANI (@ANI) July 15, 2024
ప్రధాని మోదీ తనకు ప్రణామాలు చేశారని, తమ దగ్గరికి వచ్చినవాళ్లను దీవించడం తమ విధానమని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు శత్రువు కాదు అని, ఆయన శుభం కోరుకునేవాళ్లమని, ఆయన సంక్షేమం గురించి ఆలోచిస్తామని, కానీ ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆ విషయాన్ని మేం ఎత్తి చూపుతామని అవిముక్తేశ్వరానంద తెలిపారు.