రాంచీ: తన గుంపు నుంచి వేరుపడిన ఒక మగ ఏనుగు జార్ఖండ్లో గ్రామాలపై విరుచుకుపడి మారణహోమం సృష్టిస్తున్నది. ఆ ఏకదంత ఏనుగు బారిన పడి గత తొమ్మిది రోజుల్లో 22 మంది ప్రాణాలను పోగొట్టుకోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ మద గజం కోసం అటవీ శాఖాధికారులు ఈ నెలారంభం నుంచి గాలిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ‘ఎలిఫెంట్ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. 550 నుంచి 600 ఏనుగులున్న రాష్ట్రంలో 2000-2025 మధ్య ఏనుగుల దాడులతో 1,400 మంది మరణించగా, 600 మందికి పైగా గాయపడ్డారు.