చెన్నై: తమిళనాడు రాష్ట్రంపై కేంద్రంలోని మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాతీయ విద్యా విధానం, త్రి భాషా విధానాల్ని తిరస్కరించినప్పటి నుంచి కేంద్రం తమపై బహిరంగ బెదిరింపులకు దిగుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన రూ.2,152 కోట్ల నిధులను వేరే రాష్ర్టాలకు తరలించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘కేంద్రం తమిళనాడు విద్యార్థులకు రావాల్సిన రూ.2,152 కోట్లు రాకుండా అడ్డుకున్నది. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు ఇలా చేయలేదు’ అని స్టాలిన్ అన్నారు.