రాంచీ: నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. (Children Escape From Juvenile Home) గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చైబాసాలోని జువెనైల్ హోమ్‌లో రిమాండ్‌లో ఉన్న నేర చరిత్ర ఉన్న బాలురు తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో 21 మంది పిల్లలు గుంపుగా మెయిన్ గేట్‌ను తోసుకుని బయటకు వచ్చారు. కొందరు బాలురు కర్రలు చేతపట్టి హల్చల్ చేశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలతోపాటు పలు వస్తువులను ధ్వంసం చేశారు. రహదారి వద్దకు చేరుకుని పారిపోయారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది పిల్లలను అడ్డుకోలేకపోయారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్న పిల్లల కోసం వెతికారు. నలుగురిని పట్టుకుని తిరిగి అక్కడకు తరలించారు. పరారీలో ఉన్న మిగతా వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకుని పారిపోతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
चाईबासा के बाल सुधार गृह से बड़ी संख्या में बाल कैदियों के फरार होने की घटना सुरक्षा व्यवस्था में गंभीर चूक को दर्शाती है।
बाल सुधार गृह का उद्देश्य भटके हुए किशोरों को समाज की मुख्यधारा से जोड़ना होता है, लेकिन चाईबासा की यह घटना दर्शाती है कि सरकार बाल सुधार गृह के नाम पर… pic.twitter.com/5D1Zgnuznt
— Babulal Marandi (@yourBabulal) April 2, 2025