న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది మృతిచెందారు. మరో 1,43,449 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు బలవగా, 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మోత్తంగా కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సరికొత్త మైళురాయిని అందుకోనున్నది. ఇప్పటివరకు దేశ్వవ్యాప్తంగా 199.98 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు.