పాట్నా: ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆ ట్యాంకర్‌ను వెంబడించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని వదిలి డ్రైవర్, వ్యాపారి పారిపోయారు. దీంతో ఆయిల్ ట్యాంకర్లో ఉన్న 200 కార్టన్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Liquor Seized From HP Oil Tanker) బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉంది. అయినప్పటికీ మద్యం రవాణా, అమ్మకాలు అక్రమంగా కొనసాగుతున్నాయి.
కాగా, నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ఆయిల్ ట్యాంకర్లో మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు బీహార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సమాచారం అందింది. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. గమనించిన ట్యాంకర్ డ్రైవర్ ఆ వాహనాన్ని జాతీయ రహదారి వైపు మళ్లించాడు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆ ట్యాంకర్‌ను వెంబడించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని వదిలేసి డ్రైవర్, వ్యాపారి పారిపోయారు.
మరోవైపు ఆయిల్ ట్యాంకర్ వద్దకు చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు లోపల తనిఖీ చేశారు. అందులో ఉన్న 200 కార్టన్ల మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినట్లుగా గుర్తించారు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న స్థానిక వ్యాపారిని అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. కాగా, ఆయిల్ ట్యాంకర్ నుంచి మద్యం కార్టన్లను బయటకు తీస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कल मुजफ्फरपुर में एक टैंकर के अंदर से निकला अवैध शराब का इतना बड़ा खेप
कब शराबबंदी को फेल मानेंगे नीतीश कुमार?#Muzaffarpur #MuzaffarpurAsks #Bihar #HoochTragedy pic.twitter.com/gRqjyOwaFD
— Thakur Divya Prakash (@Divyaprakas8) October 23, 2024