కోటా: రాజస్థాన్‌లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్‌కు చెందిన అశుతోశ్ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. బుధవారం రాత్రి తాను నివాసముంటున్న రూములో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దాదాబరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటాలో గత ఏడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 15 మంది ఉసురు తీసుకున్నారు.