హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బియ్యం ఎగుమతిపై సుంకం విధింపుతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్ఠ దిగజారడంతోపాటు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆందోళన వ్యక్తంచేసింది.
సుంకం విధింపును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాన్ బాస్మతి బియ్యంపై కేంద్రం విధించిన 20% సుంకంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత బియ్యానికి ఆదరణ తగ్గుతుందన్నారు.