శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని గొహల్లాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి అనుమానాస్పద కదలికలను భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని లభించిందన్నారు. గతవారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రిరస్టులు హతమయ్యారు. సోపార్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు.
ఇస్రో హాట్రిక్.. పుష్పక్ ప్రయోగం విజయవంతం
బెంగళూరు: పునర్వినియోగ వాహకనౌక కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్నా అభివృద్ధిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ముందడుగు వేసింది. పుష్పక్ పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV)03ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో (ATR) ట్రయల్ ప్రయోగాన్ని నిర్వహించింది. దాదాపు 320 కిలో మీటర్ల వేగంతో నేల మీదకు దిగిన పుష్పక్ (Pushpak).. సొంతంగా రన్‌వే పై ల్యాండ్ అయింది. దానికదే వేగాన్ని తగ్గించుకొని ఆగిపోయింది. దీంతో ఇప్పటికే రెండుసార్లు చేసిన ప్రయోగం విజయవం సాధించగా, మూడోసారి కూడా ప్రయోగం చేసి విజయం సాధించినట్లు ఇస్రో ప్రకటించింది.
వినర్వినియోగ వాహక నౌక ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్లో ఇస్రో మూడో, చివరి వరుస విజయన్ని సాధించిందని ఎక్స్ వేదికగా వెల్లడించింది. పుష్పక్ ఒక ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ను అమలుచేస్తున్నదని తెలిపింది. సవాలుతో కూడిన పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తున్నదని వెల్లడించింది.