Heat Stroke | ఠారెత్తిస్తున్న ఎండలు.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లలు, ఆటో డ్రైవర్ మృతి
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
భోపాల్: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు. (Heat Stroke) గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో గత 15 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. గ్వాలియర్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఈ ఎండలకు జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. బుధవారం ఎండ తీవ్రతకు ఇద్దరు పిల్లలు మరణించారు. తల్లితో పాటు బయటకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురై చనిపోయారు. ఒక ఆటో డ్రైవర్ కూడా రోడ్డుపైనే మృత్యువాత పడ్డాడు. సోమవారం, మంగళవారం కూడా వడదెబ్బ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కాగా, గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Children
- Dies
- Gwalior
- heat stroke
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

