ముంబై: మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. సమ్మర్ క్యాంప్‌కు (Summer Camp) వెళ్లిన చిన్నారిపై ఓ టీచర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. వేసవి సెలవులు కావడంతో ఉల్లాస్‌నగర్‌లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి 2.5 ఏండ్ల చిన్నారి హాజరవుతున్నది. ఎవరూ లేని సమయంలో ఆమెపై 45 ఏండ్ల డ్యాన్స్ టీచర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం ఇంటికి వెళ్లిన చిన్నారి.. నొప్పితో ఏడుస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆరాతీశారు. దీంతో తనపై జరిగిన దారుణాన్ని తెలపడంతో.. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉల్లాస్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం నిందితుడికి మూడేండ్లే పోలీస్ కస్టడీ విధించింది.