ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 23:53:03

‘బీహార్‌లో 19 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించాం’

‘బీహార్‌లో 19 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించాం’

న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్రంలో వరదలను ఎదుర్కొనేందుకు 19 ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం) బృందాలను మోహరించామని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్ మంగళవారం తెలిపారు. ఆయా బృందాలను జిల్లాల వారీగా కేటాయించామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ డీజీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

బీహార్లో కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రాష్ట్రంలో జులై 18 నుంచి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బీహార్ విపత్తు నిర్వహణ విభాగం మధుబని, సీతామర్హి, ముజఫర్ పూర్, ఖగారియా, పూర్వీ చంపారన్, సమస్టిపూర్, బెగుసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్లకు లేఖ రాసింది.logo